ఆగస్టులో తెరపైకి ముమైత్ "టార్గెట్"
|
ఈ సందర్భంగా ముమైత్ ఖాన్ మాట్లాడుతూ.. ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డానని, పూర్తిగా రిస్క్‌ను చవిచూశానని, తనకున్న ఇమేజ్ మరింత పెరుగుంతదని ఆశాభావం వ్యక్తం చేశారు. పాత్రరీత్యా వైవిధ్యం పోషించాలనే షరాన్ స్టోన్ తరహాలో నటించడంలో తప్పులేదని ఆమె అభిప్రాయపడ్డారు.
నిర్మాత దశరద్ సంగిశెట్టి మాట్లాడుతూ... సినిమా ప్రారంభంలో ఎటువంటి ధైర్యంతో ఉన్ననో చివరి వరకు అలాగే ఉన్నానని, వారం రోజుల్లో తొలికాపీ సిద్ధమౌతోందని, ఆగస్టు నెలాఖరులో సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. పెక్యులర్ పాత్రను పోషించానని శివబాలాజీ చెప్పారు.
ఇంకా ఈ సినిమాలో వేణుమాధవ్, కృష్ణభగవాన్, జీవా, కొండవలస, విజయరంగరాజు, గీతా సింగ్, గౌతంరాజు తదితరులు నటించారు. సంగీతం.. కోటీ., కెమెరా... వి.ఎన్. సురేష్ కుమార్, మాటలు.. వెలిగొండ శ్రీనివాస్, ఆర్ట్.. బాబ్జీ, నిర్మాతలు.. దశరధ్ సంగిశెట్టి, బి. రామకృష్ణ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. రమేష్ రాజా.
