శివాజీ, మీరా జాస్మిన్, సంగీత హీరోహీరోయిన్లుగా లక్కీ మీడియా పతాకంపై రూపొందుతోన్న చిత్రం "మా ఆయన చంటి పిల్లాడు". ఈ నెల 25న విడుదలవుతోన్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డు క్లీన్ యు సర్టిఫికేట్ ఇచ్చిందని, హీరో శివాజీ తెలిపారు. పల్లెటూరి వాతావరణంలో జరిగే కథను ఆధారంగా తీసుకుని, ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు సెంటిమెంట్‌తో రూపొందించామని ఆయన వెల్లడించారు.
చిత్ర దర్సకుడు రాజా వన్నెంరెడ్డి మాట్లాడుతూ... టైటిల్‌కు మంచి స్పందన వచ్చిందని, తమిళ మాతృకను తీసుకుని, తెలుగులో క్లైమాక్స్‌ను మార్చి తీశామని, శివాజీ బాగా నటించారని చెప్పారు. చిత్ర సమర్పకుడు సోమా విజయ ప్రకాష్ మాట్లాడుతూ... "ఎన్ పురుషన్ కులందై మాదిరి" అనే తమిళ చిత్రాన్ని చూసి మన నేటివిటికీ చక్కగా సరిపోతుందని నిర్మించామని, చక్కని కుటుంబ కథా చిత్రమిదని, శ్రీలేఖ చక్కని మెలోడీని అందించారని అన్నారు.
|