1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు "రెయిన్‌ బో"

వెండితెర కథనాలు ఆగస్టు ప్రేక్షకులు ముందు రెయిన్‌ బో దర్శకుడు
"హ్యాపీడేస్" ఫేమ్ రాహుల్, సోనాలి చౌహాన్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం "రెయిన్‌ బో". ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర దర్శకుడు, నిర్మాత వి.ఎన్. ఆదిత్య తెలిపారు. ఈ సినిమాను భారీ అంచనాలతో యూనిట్ కృషితో తెరకెక్కించనున్నామని, దీనికోసమే సినిమా విడుదలను ఆగస్టుకు వాయిదా వేశామని అన్నారు.

లక్ష్యంవైపు అడుగిడే ప్రయత్నించే కథాంశంతో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో, సోనాలీ చౌహాన్ విభిన్న పాత్రను పోషిస్తోందని చెప్పారు. దర్శకులు రాజమౌళి, శ్రీను వైట్ల, కోడి రామకృష్ణ, వి. సముద్ర నిజజీవిత పాత్రలనే పోషిస్తున్నఈ సినిమాలో, పరుచూరి వెంకటేశ్వర రావు, గొల్లపూడి మారుతీ రావు, ధర్మవరపు, సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్. సత్యనారాయణ, సునీల్, ఉత్తేజ్, కొండవలస, లక్ష్మణ రావు తదితరులు నటిస్తున్నారు.
About Writer
Selvi