1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

ఆ ''A'' సీన్లు వుంటే ఇంకా బావుండేది : షెర్లిన్

ఆ 'A' సీన్లు వుంటే ఇంకా బావుండేది : షెర్లిన్
FILE
ఇదే నా స్టయిల్
బాంబ్ షెల్ షెర్లిన్ చోప్రా తాజా మ్యూజిక్ వీడియో ఆల్బమ్ భారీగా సెన్సార్ కత్తెరలకు గురైంది. అయినా 'దర్ద్- ఇ- షెర్లిన్' హాట్‌గానే వుంటుందని చెపుతోందీ సెక్సీ బ్యూటీ. సెన్సార్ కత్తెరల తర్వాత తన ఆల్బమ్‌ను చిన్న పిల్లలు సైతం ఎంచక్కా చూడవచ్చంటోందీ వగలాడి.
FILE

అందాలన్నీ చూపించాలనుకున్నా

తన అందాల ప్రదర్శనలో ప్రధాన దృశ్యాలు తొలగింపునకు గురవడంపై సెన్సార్‌పై రుసరుసలాడుతోంది. మ్యూజిక్ వీడియో ఎటువంటి కత్తెరలకు గురవకుండా ప్రేక్షకులకు చేరి వుంటే తాను ఎంతో సంతోషించి వుండేదాన్నని అంటోంది. 'ఔట్రెజియస్' తర్వాత విడుదలైన రెండో ఆల్బమ్ ఈ 'దర్ద్- ఇ- షెర్లిన్'.

FILE

నేను దేనికీ సిగ్గుపడను

21వ శతాబ్దంలో అమ్మాయిలు దేనికీ సిగ్గు పడకూడదంటూనే... తనదైన స్టయిల్‌ను ఈ ఆల్బమ్‌లో ప్రదర్శించానని చెపుతోంది. సుమారు 18 కత్తెరలకు గురైందంటే ఈ ఆల్బమ్ ఎలా వుంటుందో చూస్తేగాని తెలియదు. ఇదిలా వుంటే బాలీవుడ్ హాట్ తారలు మల్లికా శెరావత్, బిపాసా బసు షెర్లిన్ రంగ ప్రవేశంపై అసూయను ప్రదర్శిస్తున్నారట. ఏం చేద్దాం... ఎవరి అందం వారిది... ఎవరి ప్రదర్శన వారిది.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలలో పనిచేసారు..... మరింత చదవండి