సెప్టెంబరులో "కౌసల్య.. సుప్రజా.. రామ"
|
పూర్తిగా కుటుంబకథా నేపథ్యంలో, వినోదాత్మకంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి రమణ గోగుల సంగీతం సమకూర్చుతున్నారు. ఎం.ఎం. శ్రీలేఖ అందించిన పాటలకు.. రమణ సంగీతం తోడై శ్రోతల నుంచి మంచి స్పందన లభిస్తుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇకపోతే ఈ సినిమా ఆడియోను ఈ నెలలో, సినిమాను సెప్టెంబరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
