22న తెరపైకి వస్తున్న"కళ్యాణం"
శ్రీకర్ ఫిలింక్రాఫ్ట్ పతాకంపై రూపొందుతోన్న సినిమా "కళ్యాణం". ఈ సినిమాకు మురళీకృష్ణ దర్శకత్వం వహిస్తుండగా, డా. కె కృష్ణ ప్రసాద్ సమర్పలో నిర్మితమవుతోంది. చందు, జ్యోత్స, సంయోగిత హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 22న విడుదల చేయనున్నట్లు నిర్మాత సాయి ప్రతాప్ తెలిపారు. ఫ్యామిలీ అండ్ యూత్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దామని ఆయన అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ... పాత చిత్రాల పాటలను గుర్తుకుతెచ్చేవిధంగా రెండు పాటలుంటాయనీ, అవి ఈ సినిమాకి హైలెట్‌గా నిలుస్తాయని చెప్పారు. దాదాపు 48 సంవత్సరాలు పూర్తిచేసుకున్న ఆనాటి ఆణిముత్యం చిత్రంలోని కుశుడు పాత్రను పోషించిన సుబ్రహ్మణ్యం ఈ చిత్రంలో హీరో తండ్రి పాత్ర పోషిస్తున్నారని చెప్పారు.
ఇంకా ఈ చిత్రంలో పిళ్లాప్రసాద్, చిన్నా, రామిరెడ్డి, దిల్ రమేష్, గుండు హనుమంతరావు, ఆనంద్, గౌతంరాజు, జూ. రేలంగి, సుబ్బరావు, తదితరులు నటిస్తున్నారు. పాటలు... పోతుల రవికిరణ్, గురుచరణ్, సంగీతం... కనకేశ్ రాథోడ్, కెమెరా... గాదిరాజు శ్రీనివాస్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం... మురళీకృష్ణ.