21న తెరపైకి రానున్న "ఆదివిష్ణు"
|
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఆడియోకు విశేష స్పందన లభించిందని, సినిమా విడుదలకు ముందే నాలుగు లక్షల ఆడియో సి.డిలు సేల్స్ అయి సంచలనం సృష్టించిందన్నారు. ఆ విధంగానే ఈ సినిమా కూడా క్లాస్ ప్రేక్షకుల్ని మాత్రమే కాకుండా మాస్‌ను సైతం మైమరపిస్తుందని, సినిమా ప్రథమార్థం అంతా హాయిగా అందర్నీ నవ్విస్తుందని చెప్పారు.
ద్వితీయార్థం అందర్నీ ఆకట్టుకుంటుందని, తర్వాత ఏం జరుగుతుందనే సస్పెన్స్‌ను ప్రేక్షకుడిలో కలిగిస్తుందని వెల్లడించారు. ఈ సినిమా హీరో అరుణ్‌కి పెద్ద పేరుని, దర్శకుడిగా తనకు గుర్తింపును తెచ్చిపెడుతుందని, మొత్తం 150 థియేటర్స్‌లో ఈ చిత్రం విడుదలవుతుందని వెల్లడించారు.

