1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

28న విడుదలకు సిద్ధంగా ఉన్న"హోమం"

శ్రేయ ప్రొడక్షన్స్ పతాకంపై జె.డి. చక్రవర్తి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం
FileFILE
శ్రేయ ప్రొడక్షన్స్ పతాకంపై జె.డి. చక్రవర్తి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం "హోమం". జగపతిబాబు, మమతామోహన్‌దాస్ జంటగా నటించిన ఈ చిత్రం ఈ నెల 21 తేదీన సెన్సార్ కానుంది. సెన్సార్ పూర్తి చేసుకుని ఈనెల 28న సినిమాని విడుదల చేస్తున్నామని చిత్ర నిర్మాత కిరణ్‌కుమార్ కోనేరు మంగళవారం నాడు వెల్లడించారు. ఈ చిత్రాన్ని దిల్‌రాజు తన డిస్ట్రిబ్యూషన్ అయిన శ్రీవెంకటేశ్వర క్రియేషన్‌పై విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా దిల్‌రాజు మాట్లాడుతూ... ఇటీవల మా డిస్ట్రిబ్యూషన్ నుంచి బయటకు వచ్చిన "హాపీడేస్" "ఉల్లాసంగా ఉత్సాహంగా" సినిమాలు ఆదరణ పొందడంతో చాలా సంతోషంగా ఉన్నానని చెప్పారు. అంత ఉత్సాహంగానే "హోమం" చిత్రాన్ని ఆంధ్రా అంతా రిలీజ్ చేస్తున్నానని తెలిపారు. డబుల్ పాజిటివ్‌లోనే సినిమాను చూశానని, ఇందులో జె.డి చక్రవర్తి అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పారు.

పేరు "హోమం" అయినా మ్యాజిక్ కూడా బాగుందన్నారు. సినిమాకు చక్రి చక్కని సంగీతాన్ని సమకూర్చారన్నారు. అదేకాకుండా ఉల్లాసంగా ఉత్సాహంగా టికెట్లు కొన్న మొదటి పదిమందికి హోమం సీడీని థియోటర్‌లో ప్రెజెంట్ చేస్తాం అని చెప్పారు.

జె.డి చక్రవర్తి మాట్లాడుతూ... ఈ చిత్రాన్ని చూడకుమందు దిల్‌రాజుగారు ఇది పూర్తి యాక్షన్ సినిమా అన్నారని చెప్పారు. కానీ చూశాక మనస్సు మార్చుకుని లవ్, మ్యూజికల్, ఎమోషనల్ సినిమా అని అన్నారని తెలిపారు. ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందనే నమ్మకముందని తెలిపారు.

విజయవాడలో 27లో...
"హోమం" సినిమాని ఈ నెల 27వ తేదీనే ప్రిమియర్ షోను సన్నిహితులకు, అతిథులకు ఐనాక్స్ థియోటర్‌లో ప్రదర్శిస్తున్నట్లు నిర్మాత కిరణ్‌కుమార్ తెలిపారు.
About Writer
PNR
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి