రవితేజ, శ్రియ హీరోహీరోయిన్లుగా పూరీజగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం "నేనింతే". చిత్రాన్ని యూనివర్శల్ అధినేత డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్నారు. సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోందని చిత్ర యూనిట్ వెల్లడించింది.
ఇప్పటికే 30 శాతం షూటింగ్‌తో పాటు ఒక పాట, రెండు ఫైట్స్ కూడా పూర్తయ్యాయని డి.వి.వి.దానయ్య వెల్లడించారు. ఈ చిత్రంలో రవితేజ చక్కని పాత్ర పోషిస్తున్నారని, ఆయన బాడీ లాంగ్వేజ్‌కు తగిన రోల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు డివివి తెలిపారు.