అక్టోబర్ 1న వస్తున్న "చింతకాయల రవి"
|
ఇటీవలే విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభించిందని, త్వరలో ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేయనున్నామన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన తొలికాపీ ఈ వారంలో సిద్ధమవుతుందని నిర్మాత వెల్లడించారు. అన్ని కార్యక్రమాలు ముగించుకుని అక్టోబర్ 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా వెంకటేష్ నటిస్తున్నారని చెప్పారు.
ఇందులో మరో విశేషమేమిటంటే... ఇటీవలే జరిగిన ఆడియో వేడుకల్లో ఎన్టీఆర్ మాట్లాడుతూ... తనకు "ఆది" చిత్రం ఎంతో గుర్తింపునిచ్చిందని, ఆ చిత్రాన్ని నిర్మించిన నల్లమలుపు బుజ్జికి ధన్యవాదాలు తెలియజేశారు. ఆ చిత్రం ద్వారా తనకూ, వినాయక్‌కు మంచి పేరు వచ్చిందని, అదేవిధంగా వినాయక్, వెంకటేష్ కాంబినేషన్‌లో వచ్చిన "లక్ష్మీ"కి నిర్మాతగా బుజ్జికి మంచి పేరు వచ్చిందని గుర్తు చేశారు.
ఆ తర్వాత బుజ్జితో తానేమీ చేయలేకపోయానని, త్వరలో బుజ్జి నిర్మాతగా తాను నటించనున్నానని ప్రకటించారు. అయితే... విశ్వసనీయ సమాచారం ప్రకారం బుజ్జితో ఉన్న అనుబంధమో, లేక వెంకటేష్‌తో ఉన్న స్నేహం కారణంగానేమో..? "చింతకాయల రవి"లో ఎన్టీఆర్ ఓ సాంగ్‌లో కనబడుతున్నారని తెలిసింది. వెంకటేష్, అనుష్క, నిఖిత కాంబినేషన్‌లో వచ్చే ఓ పాటలో ఎన్టీఆర్ కన్పించనున్నట్లు తెలియవచ్చింది.
