1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

దసరా కానుకగా "కొత్తబంగారు లోకం"

వినోదం వెండితెర రాబోయే చిత్రాలు కొత్తవారు కొత్తబంగారు లోకం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ శ్రీకాంత్ దసరా కానుక నిర్మాత దిల్రాజు
అంతా కొత్తవారితో "దిల్‌రాజు" నిర్మిస్తోన్న సినిమా "కొత్తబంగారు లోకం". శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ సినిమాకు శ్రీకాంత్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ తొమ్మిదిన విడుదల చేస్తున్నట్లు నిర్మాత దిల్‌రాజు తెలిపారు.

దసరాకు తమ చిత్రాలకు అవినాభావ సంబంధం ఉందని దిల్‌రాజు వెల్లడించారు. ఇందులో భాగంగా, గత 2006 ఆగస్టులో బొమ్మరిల్లు విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడిందని, అదేవిధంగా.. 2007 అక్టోబర్ 2న హ్యాపీడేస్ విడుదలైందన్నారు. అదే కోవలో ఈ దసరాకు "కొత్తబంగారు లోకం" విడుదలై దసరా విజయాన్ని అందిస్తుందనే నమ్మకం ఉందని చెప్పారు.

ఇంకా దిల్‌రాజు మాట్లాడుతూ... తమ సంస్థలో సినిమా పూర్తయ్యేందుకు చాలా కాలం పడుతుందనీ, అదంతా ఫర్ఫెక్షన్ కోసమే జాప్యం జరుగుతుందని వివరించారు. కొత్తవారయితే ఇంకా ఎక్కువ సమయం పడుతుందని, అందుకే "కొత్తబంగారు లోకం" విడుదలకు ఆలస్యమైందని వివరించారు.

తండ్రి పాత్రకు ప్రకాష్‌రాజ్ చేయాలని ఎంత ఆలస్యమయినా పర్వాలేదని, ఆయన కోసం వేచిచూశామన్నారు. డబుల్ పాజిటివ్ చూశాక ప్రకాష్‌రాజ్ లేనిదే సినిమా లేదని అందరూ అంటుంటే తన నిర్ణయం సరైందనని మరోసారి రుజువయిందని పేర్కొన్నారు.

సినిమా ఫోటోగ్రాఫర్ ఛోటాకేనాయుడు మాట్లాడుతూ.... 40 రోజుల్లో సినిమాను పూర్తిచేస్తామని చెప్పిన రాజు మామూలుగానే ఆలస్యం చేయడం తమకు అసహనానికి గురిచేసినప్పటికీ, ఎందుకలా ప్రతి సినిమాకి జరుగుతుందనేది అనుభవపూర్వకంగా తెల్సుకున్నానని చెప్పారు. చిన్న విషయాన్నికూడా కాంప్రెమైజ్ కాకుండా చక్కని ఔట్ పుట్ కోసం ఆయన చేస్తున్న కృషిని అభినందిస్తున్నామని తెలిపారు.