1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

అక్టోబర్ మొదటివారంలో వస్తున్న "ఏకలవ్‌యుడు"

వినోదం వెండితెర రాబోయే చిత్రాలు సూపర్ సెన్సేషనల్ హిట్ నరసింహనాయుడు ఏకలవ్యుడు నిర్మాత మేడికొండ మురళీకృష్ణ సమర్పణ
సూపర్ సెన్సేషనల్ హిట్ "నరసింహనాయుడు" చిత్ర నిర్మాత మేడికొండ మురళీకృష్ణ సమర్పణలో యూత్ హీరో ఉదయ్‌కిరణ్ కథానాయకుడిగా కె.ఆర్.కె. దర్శకత్వంలో యువ నిర్మాత మేడికొండ అమర్‌చంద్, శ్రీ వెంకట రమణ ఫిలింస్ పతాకంపై ప్రొడక్షన్ నెం-10గా నిర్మిస్తోన్న లవ్‌లీ ఎంటర్‌టైనర్ చిత్రం "ఏకలవ్‌యుడు".

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. అనిల్ కృష్ణ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ సినిమా ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించింది.

ఈ సందర్భంగా హీరో ఉదయ్‌కిరణ్ మాట్లాడుతూ... "ఏకలవ్‌యుడు" అనే డిఫరెంట్ టైటిల్‌తో... కథే ప్రధానంగా రూపొందిస్తున్న చిత్రమిదన్నారు. ఒక కమర్షియల్ సినిమాలో ఉండాల్సిన అన్ని అంశాలు కరక్ట్ ప్లేస్‌మెంట్స్‌లో ఉండేలా డైరక్టర్ కె.ఆర్.కె. చాలా జాగ్రత్త తీసుకున్నారని చెప్పారు.

తాను ఇంతకుముందు చేసిన సినిమాలతో పోలీస్తే ఇందులో డెప్త్, ఎమోషన్స్ ఎక్కువ ఉన్నాయని వెల్లడించారు. దీంతోపాటు ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉంటుందని, అమ్మాయి, అబ్బాయి ప్రేమలో పడటం, వారి ప్రేమ నెగ్గడం అన్నదే కాకుండా ఒకరికి మనసివ్వడం కంటే వారి కోసం బ్రతకగలమా? ఒకవేళ చావాల్సిన పరిస్థితి వస్తే కూడా సిద్ధమేనా? అన్న పాయింట్‌ను తీసుకుని చిత్రంగా మలిచారన్నారు.

ఇలాంటి చక్కని చిత్రాన్ని నిర్మిస్తున్న మురళీకృష్ణగారు చాలా గ్రేట్ అని ఉదయ్‌కిరణ్ తెలిపారు. ఎందుకంటే నరసింహనాయుడు లాంటి బ్లాక్ బస్టర్ మూవీ నిర్మించిన ఆయన, క్రేజీ కాంబినేషన్ కోసం చూడకుండా కథను నమ్ముకుని ఆల్‌మోస్ట్ అందరూ కొత్త టెక్నీషియన్స్‌తో సినిమా చేయడం గొప్ప విషయమని వెల్లడించారు.

అనిల్‌కృష్ణ ఈ సినిమా ద్వారా మ్యూజిక్ డైరక్టర్‌గా ఇంట్రడ్యూస్ అవుతున్నాడని, చాలా అద్భుతంగా సంగీతాన్ని అందించారని చెప్పారు. తాను నటించిన సినిమాలన్నీ మ్యూజికల్‌గా పెద్ద హిట్ అయ్యాయని ఉదయ్‌కిరణ్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

చిత్ర సమర్పకులు మేడికొండ మురళీకృష్ణ మాట్లాడుతూ... చిత్ర ఆడియో కచ్చితంగా సక్సెస్ అవుతుందన్న నమ్మకం అందరికీ ఉందని, రీరికార్డింగ్ చాలా ఎక్స్‌లెంట్‌గా వచ్చిందని, మణిశర్మ మ్యూజిక్‌లో ఉండే బీట్, కీరవాణి మ్యూజిక్‌లో ఉండే మెలోడి కలిస్తే ఎలా ఉంటుందో అనిల్ మ్యూజిక్ అలా ఉంటుందని మురళీకృష్ణ చెప్పారు.

"ఏకలవ్‌యుడు" తర్వాత అనిల్‌కృష్ణ చాలా పెద్ద మ్యూజిక్ డైరక్టర్ అవుతారని అన్నారు. ఉదయ్‌కిరణ్‌కు ఈ సినిమా గుర్తింపును సాధించిపెడుతుందని, హీరోయిన్ కృతి పాత్రకు తగ్గట్టు చక్కగా అమరిందని తెలిపారు. ఊటీ బ్యాక్‌డ్రాప్‌లో కథనడుస్తుందని, నెగటివ్ గ్రేడింగ్ చేసి రెండు రోజుల్లో తొలికాపీని సిద్ధం చేస్తున్నామన్నారు. సెన్సార్ పూర్తిచేసుకుని నవరాత్రుల్లో ఒకరోజు రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నామని మేడికొండ వెల్లడించారు.

శ్రీవెంకటరమణ ఫిలింస్ పతాకంపై తెరకెక్కుతోన్న "ఏకలవ్‌యుడు" సినిమాకు మాటలు... రాఖీ, రాధాకృష్ణ, పాటలు... వేటూరి, రామజోగయ్యశాస్త్రి, పైడిశెట్టి రామ్, ఫోటోగ్రఫీ... రమేష్ కృష్ణ, సంగీతం... అనిల్ కృష్ణ.
About Writer
Selvi