1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

నవంబర్‌లో "మిష్టర్ గిరీశం"!

వినోదం వెండితెర రాబోయే చిత్రాలు కృష్ణభగవాన్ టైటిల్ రోల్ మిష్టర్ గిరీశం విశ్వప్రసాద్ దర్శకత్వం రమేష్ చంద్ర బెనర్జీబాబు
కృష్ణభగవాన్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం "మిష్టర్ గిరీశం". విశ్వప్రసాద్ దర్శకత్వంలో రమేష్ చంద్ర బెనర్జీబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్ర ఆడియో విజయదశమినాడు విడుదలైంది. తొలి సీడీని ఎం.ఎం. కీరవాణి విడుదల చేసి ఆర్. నారాయణమూర్తికి అందించారు.

వంద సంవత్సరాల చరిత్ర కలిగిన గురజాడవారి "కన్యాశుల్కం" నాటకాన్ని నేటి పరిస్థితులకు అనుగుణంగా తీయడం సాహసంతో కూడుకున్నదని, అందుకు ముందుకొచ్చిన దర్శక నిర్మాతలను అభినందిస్తున్నానన్నారు.

దర్శకుడు విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పారు. కీరవాణి స్పందిస్తూ... ఖుద్దూస్ సంగీతం ఆకట్టుకుందని, నవంబరులో సినిమాను విడుదల చేస్తున్నట్లు తెలిపారు.
About Writer
SELVI.M