23న వస్తున్న నితిన్ "హీరో", తేజ "కేక"
నితిన్ హీరోగా, భావన హీరోయిన్‌గా నటిస్తున్న "హీరో" చిత్రం, ప్రముఖ దర్శకుడు తేజ రూపొందిస్తున్న "కేక" సినిమా ఈ నెల 23న తెరకెక్కనున్నాయి. హీరోకు ప్రాధాన్యత గల "హీరో" సినిమాలో "ఒంటరి" ఫేమ్ భావన కీలక పాత్ర పోషిస్తోంది.
జీవీ సుధాకర్ నాయుడు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మన్యం రమేష్ నిర్మిస్తున్నారు. మన్యం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మన్యం సూర్యనారాయణ సమర్పిస్తున్నారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటున్న "హీరో" సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుందని చిత్ర యూనిట్ వెల్లడించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 23వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. "సై" తర్వాత నితిన్ అంతటి స్టైలిష్ పాత్రను ఈ సినిమాలో పోషిస్తున్నారు.
తేజ "కేక"
రాజ, ఇషానీలను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ ప్రముఖ దర్శకుడు తేజ రూపొందిస్తున్న చిత్రం "కేక". చిత్రం మూవీస్ పతాకంపై తెరకెక్కనున్న ఈ సినిమాలో మరో 36మంది కొత్త ఆర్టిస్టులను తేజ వెండితెరకు పరిచయం చేస్తున్నారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుని ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు తేజ సన్నాహాలు చేస్తున్నారు. వీధి బాలల నేపథ్యంలో సాగే కథాంశంతో వస్తున్న ఈ సినిమాపై తేజ భారీ అంచనాలను పెట్టుకున్నారు. "ఒక విచిత్రం" తర్వాత గ్యాప్ తీసుకున్న తేజ విభిన్నంగా "కేక" ను తెరకెక్కించారు.