దీపావళి కానుకగా "సూర్య సన్నాఫ్ కృష్ణన్"
|
తాము ఈ చిత్రాన్ని నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఆస్కార్ రవిచంద్రన్, గౌతమ్ ఓ కారణమైతే, హారిస్ జైరాజ్, కెమెరా రత్నవేలు, ఎడిటర్ ఆంథోనీలు పనిచేయడం కూడా మరో కారణమని దిల్ రాజు తెలిపారు. సూర్య నటించిన గజిని సూపర్ హిట్టైందని, అలాగే దీపావళి కానుకగా విడుదలవుతున్న ఈ చిత్రం మంచి సక్సెస్ సాధిస్తుందనే నమ్మకముందని తెలిపారు.
సి.వి.ఆర్. మీడియా అధినేత శోభారాణి మాట్లాడుతూ... తమ బేనర్‌లో "దశావతారం" విడుదలై సక్సెస్ అయిందని, ప్రస్తుతం "సూర్య సన్నాఫ్ కృష్ణన్"ను రిలీజ్ చేస్తున్నామని, ఇటీవలే సోని మ్యూజిక్ ద్వారా విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభించదన్నారు.
ఈ చిత్రంలో సూర్య 17 ఏళ్ల యువకుడి నుంచి 70 ఏళ్ల వృద్ధుడి వరకు రకరకాల షేడ్స్‌లో కన్పిస్తారని, ముఖ్యంగా యువకుడిగా నటించడానికి దాదాపు ఆరు నెలలు భోజనం లేకుండా కేవలం ఫ్రూట్స్‌నే తీసుకుంటూ బాడీని తీర్చిదిద్దుకున్నారని వెల్లడించారు.
తండ్రీకొడుకులు, కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయత అనురాగాలు ఎలా ఉంటాయో దర్శకుడు గౌతమ్ చక్కగా ఈ చిత్రం ద్వారా చూపించారని తెలిపారు. దీపావళి నాడు విడుదలవుతున్న ఈ చిత్రం సక్సెస్ సాధించాలని శోభారాణి ఆశాభావం వ్యక్తం చేశారు.
