1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

విడుదలకు సిద్ధమైన "ఏక్ పోలీస్"

వినోదం వెండితెర రాబోయే చిత్రాలు కోడి రామకృష్ణ దర్శకత్వం నాగబాబు ఏక్పోలీస్ త్వరలో విడుదల నిర్మాత ఎన్హెచ్ భాస్కర్
కోడి రామకృష్ణ దర్శకత్వంలో నాగబాబు "ఏక్‌పోలీస్"గా నటించిన చిత్రం త్వరలో విడుదల కానుందని నిర్మాత ఎన్.హెచ్. భాస్కర్ రెడ్డి వెల్లడించారు. సమాజంలో చెడును చీల్చి చెండాడేందుకు కోడిరామకృష్ణ చేసిన ఈ సెల్యులాయిడ్ ప్రయత్నం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందని అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ.. గతంలో ఎన్నో పోలీస్ కథా చిత్రాలు వచ్చినా వాటికి పూర్తిగా భిన్నమైన, విలక్షణమైన పోలీస్ ఆఫీసర్‌గా నాగబాబు ఈ చిత్రంలో కన్పిస్తారని వెల్లడించారు. పాత్రకు నాగబాబు పూర్తి న్యాయం చేశారని, సమకాలీన రాజకీయాల చర్చ ఉంటుందని, యువతరానికి చక్కని సందేశముందని భాస్కర్ రెడ్డి చెప్పారు.

అశోక్‌కుమార్, డా. శివప్రసాద్, పృథ్వీ, సత్యప్రకాష్‌లు పాత్రలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయని, కేరళ అమ్మాయిని హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నామని భాస్కర్ చెప్పారు. సామ్రాట్, ధీరజ్, భూషణ్, సూర్యచరణ్, గాయత్రిల పాత్రలు స్ఫూర్తిదాయకంగా ఉంటాయని ఆయన తెలిపారు. సదానంద్ మెయిన్ విలన్‌గా పరిచయమవుతున్నారని భాస్కర్ వివరించారు. ఎన్.హెచ్ రుష్యా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి కోటి సంగీతం సమకూర్చుతున్నారు.
About Writer
SELVI.M