దీపావళి కానుకగా "16 డేస్"
ప్రభు సాలమన్ దర్శకత్వంలో, అరవింద్, ఛార్మీ జంటగా నటించే "16 డేస్" సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రూపుదిద్దుకంటున్న ఈ సినిమాకు "మన" చౌదరి నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.
తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్ర ఆడియో ఈ నెల 24న మార్కెట్లోకి విడుదల కానుంది. "లాడం" పేరుతో తమిళ తెరపైకి రానున్న ఈ "16 డేస్" సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను జరుపుకుంటోందని యూనిట్ వర్గాలు వెల్లడించాయి.
తమిళంలో ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించిందని, అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని దీపావళికి "16 డేస్"ను ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి.