గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » రాబోయే చిత్రాలు » త్వరలో ప్రేక్షకుల ముందుకు "ఆవకాయ్ బిర్యానీ"
రాబోయే చిత్రాలు
Feedback Print Bookmark and Share
 
FILE
కమల్ కామరాజు, బిందు మాధవి హీరోహీరోయిన్లుగా పరిచయమవుతూ, శేఖర్ కమ్ముల నిర్మాణ సారథ్యంలో తెరకెక్కనున్న చిత్రం "ఆవకాయ్ బిర్యానీ". అనీస్ కురువిల్లా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై నవంబర్ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర యూనిట్ వెల్లడించింది.

ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న "ఆవకాయ్ బిర్యానీ" అద్భుతమైన ప్రేమకథా చిత్రంగా తెరకెక్కనుంది. సెవెన్ సీటర్ ఆటో డ్రైవర్, ఆవకాయ్ అమ్ముకునే అమ్మాయిల మధ్య జరిగే ప్రేమకథను చిత్రంగా మలిచామని దర్శకుడు కురివిల్లా వెల్లడించారు. మణికాంత్ కాద్రి సమకూర్చిన సంగీతం చిత్రానికి ప్లస్ పాయింట్ అవుతుందని ఆయన చెప్పారు.

ఇకపోతే... శేఖర్ కమ్ముల నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న "ఆవకాయ్ బిర్యానీ" హ్యాపీడేస్‌లా హిట్టయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర రాబోయే చిత్రాలు కమల్ కామరాజు, బిందు మాధవి శేఖర్ కమ్ముల అనీస్ కురువిల్లా అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్