నవంబర్ 7న తెరపైకి రానున్న "యువత"
హ్యాపీడేస్ ఫేమ్ నిఖిల్ హీరోగా నటిస్తోన్న చిత్రం "యువత". నిజాం, వైజాగ్‌లలో దిల్ రాజు పంపిణీ చేస్తున్న ఈ సినిమా నవంబర్ 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మణిశర్మ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రంలో అక్ష హీరోయిన్‌గా నటిస్తోంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఉమాప్రకాష్ నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడెక్షన్స్ కార్యక్రమాలను జరుపుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ... యువతను లక్ష్యంగా చేసుకున్న చిత్రమైనప్పటికీ, విభిన్న కథాంశంతో తెరకెక్కనుందని చెప్పారు. ఈ చిత్రాన్ని వినోద భరితంగా తీర్చిదిద్దుతున్నామని, యువత ఆలోచనలు, అభిప్రాయాలు ప్రస్తుతం ఎలా ఉంటున్నాయనే అంశంపై ఈ సినిమాలో చర్చించామని తెలిపారు.
ఇంకా ఈ సినిమాకు... కెమెరా.... జశ్వంత్, సంగీతం... మణిశర్మ, పాటలు... కృష్ణచైతన్య, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం.... పరుశురామ్.