14న ''సూర్య సన్ ఆఫ్ కృష్ణన్''
తమిళ హీరో సూర్య తొలిసారి తండ్రీకొడులుగా నటించిన 'సూర్య సన్ ఆఫ్ కృష్ణన్' చిత్రం వచ్చే నెల 14వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రంలో సమీరారెడ్డి, సిమ్రాన్, దివ్యలు హీరోయిన్స్‌గా నటించారు. ఆస్కార్ ఫిలిమ్స్ బేనర్‌లో వి.రవిచంద్రన్ నిర్మాతగా గౌతం వాసుదేవ మీనన్ దర్శకత్వం వహించిన ఈ తమిళ చిత్రాన్ని తెలుగులోకి ఎస్.వి.ఆర్ మీడియా పతాకంపై శోభారాణి అనువదించారు. ఈనెల 24న ఆంధ్రప్రదేశ్‌లో 200 థియేటర్లలో ట్రైలర్స్ విడుదలయ్యాయనీ, వీటికి మంచి స్పందన వచ్చిందని ఆమె తెలిపారు. రీ-రికార్డింగ్ చేస్తున్న హ్యారీస్ జైరాజ్ ఈ చిత్రం సూపర్‌హిట్ అవుతుందని చెప్పడంతో మాకు మరింత నమ్మకం కలిగిందన్నారు. ఏ ఆర్టిస్టుకైనా అద్భుతమైన చిత్రాలు చాలా తక్కువగా వస్తాయనీ, అన్ని విధాలా సంతృప్తినిచ్చిన చిత్రమిదని సూర్య చెప్పారు.