నవంబరులో రానున్న "శశిరేఖా పరిణయం"
తరుణ్, జెనీలియా జంటగా, కృష్ణవంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న "శశిరేఖా పరిణయం" నవంబర్ మాసాంతానికి ప్రేక్షకుల ముందుకు రానుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా పాటలను నవంబర్ మొదటి వారంలో మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు వెల్లడించాయి.
ప్రస్తుతం హీరోహీరోయిన్లు తరుణ్, జెనీలియాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దీంతో ఈ సినిమా చివరి షెడ్యూల్ నవంబర్ మొదటి వారంలో పూర్తవుతుంది.
మణిశర్మ సంగీతం సమకూర్చుతున్న ఈ సినిమాకు మధు మురళీ నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని "శశిరేఖా పరిణయం" తెరపైకి వస్తుందని, ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని యూనిట్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.