సంక్రాతి కానుకగా వస్తున్న "ఫిట్టింగ్ మాస్టర్"
నరేష్, మదాల్సా శర్మ హీరోహీరోయిన్లుగా ఇ.వి.వి. సత్యనారాయణ స్వీయదర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం "ఫిట్టింగ్ మాస్టర్". ఈ చిత్రం నవంబరు 1 నుంచి వైజాగ్, అరకులలో షూటింగ్ జరుపుకోనుందని నిర్మాత ఇ.వి.వి వెల్లడించారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు పాటలు, యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడం పూర్తయిందని ఆయన తెలిపారు.
తన నిర్దేశకత్వంలో వచ్చిన కితకితలు, అత్తిలి సత్తిబాబు తర్వాత వస్తోన్న పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్ చిత్రమిదని, తమ బేనర్‌లో ఫిట్టింగ్ మాస్టర్ ఎనిమిదో చిత్రమని ఇ.వి.వి అన్నారు. కామెడీ చిత్రమైనప్పటికీ... పిల్లల అభిప్రాయాలను తల్లిదండ్రులు గౌరవించడం, తల్లిదండ్రుల మాటలను పిల్లలు గ్రహించడం వంటి చక్కని సందేశం ఈ చిత్రంలో ఇమిడి ఉందని ఇ.వి.వి వెల్లడించారు.
ఈ చిత్రానికి చిన్న సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, జూలైలో షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం నవంబర్ 15 నాటి షెడ్యూల్తో పూర్తవుతుందని ఇ.వి.వి తెలియజేశారు. డిసెంబరులో పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు పూర్తిచేసి సంక్రాతిం కానుకగా ఫిట్టింగ్ మాస్టర్తెరపైకి వస్తున్నాడని ఆయన వెల్లడించారు.