1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

15న తెరపైకి వస్తున్న "అంకుశం"

వినోదం వెండితెర రాబోయే చిత్రాలు రితీష్ శ్రీనాథ్  దర్శక నిర్మాత వికె విజయకుమార్ రెడ్డి షాఖ్య సెల్యులాయిడ్ పతాకం అంకుశం
WD
రితీష్, శ్రీనాథ్ కథానాయకులుగా, నేటి సమాజానికి ఓ మంచి సందేశాన్నిస్తూ దర్శక నిర్మాత వి.కె. విజయకుమార్ రెడ్డి పటిష్టమైన కథతో షాఖ్య సెల్యులాయిడ్ పతాకంపై తీర్చిదిద్దిన చిత్రం "అంకుశం". ఈ సినిమా తొలికాపీ సిద్ధం కావడంతో పాటు సెన్సార్‌ను కూడా పూర్తి చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇటీవలే విడుదలైన ఈ సినిమా ఆడియో శ్రోతలను అలరిస్తోందని చిత్ర దర్శక నిర్మాత వి.కె. విజయ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఎక్కడా రాజీ పడకుండా తీసిన "అంకుశం" చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకముందని, సమాజానికి మంచి మేసేజ్‌ని ఈ చిత్రం ద్వారా అందించేందుకు శాయశక్తులా కృషి చేసి ఈ చిత్రాన్ని నిర్మించామని చెప్పారు.

శ్రీనాథ్, రితీష్‌లు కథానాయకులుగా నటించిన ఈ చిత్రంలో సంగీత, కీర్తిచావ్లా, అనిత, జయప్రకాష్ రెడ్డి, శ్రీమాన్, రాళ్లపల్లి, మల్లికార్జునరావు, విజయ్ బాబు, ఆనంద రాజు తదితరులు నటిస్తున్నారు.

ఇంకా ఈ సినిమాకు సంగీతం... మనోహర్, గీతరచయిత.. సాహితి, ఛాయాగ్రహణం... అబుష మరియు అమర్, ప్రొడక్షన్... రషీద్, సమర్పణ... వి. ప్రభాకర్ రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం, నిర్మాత... వి.కె. విజయ్ కుమార్ రెడ్డి.