1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

7న తెరపైకి వస్తున్న "విజయ్ ఐపీఎస్"

వినోదం వెండితెర రాబోయే చిత్రాలు సుమంత్ 7న తెర విజయ్ ఐపీఎస్ నట్టికుమార్  పోలీసు అధికారి
సుమంత్ కథానాయకుడిగా కె. హనుమంతరెడ్డి దర్శకత్వంలో రూపొందిన "విజయ్ ఐపీఎస్" చిత్రాన్ని వంద ప్రింట్లతో శుక్రవారం (నవంబర్-7) నాడు విడుదల చేస్తున్నట్లు విశాఖ టాకీస్ అధినేత, చిత్ర నిర్మాత నట్టికుమార్ తెలియజేశారు.

చిత్రం విడుదల సందర్భంగా ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ... పూర్తి యాక్షన్ చిత్రమిదన్నారు. సెంటిమెంట్ కూడా ఈ సినిమాలో ఉందని, ఈ మధ్య జరుగుతున్న ఎన్నో సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నామన్నారు.

ఒక పోలీసు అధికారి తనకున్న పూర్తి అధికారాలను వినియోగిస్తే... కుళ్లు రాజకీయాలను ఏరిపారేయవచ్చుననే సందేశాన్ని సుమంత్ పాత్ర ద్వారా చెప్పిస్తున్నామని వెల్లడించారు. నటి ఝాన్సీ పాత్ర ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని చెప్పారు.

విద్యార్థిగా తనకు జరిగిన అన్యాయాన్ని అటు పోలీసులకు, ఇటు హోం మంత్రికి విన్నవించినా ఫలితం లేకపోవడంతో సిన్సియర్ పోలీసు అధికారి విజయ్ ఏం చేశాడన్న విషయాన్ని మరో కోణంలో రూపొందించామని తెలిపారు. వర్తమాన పరిస్థితులకు అద్దం పట్టే ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకముందని, సుమంత్ మీసంతో కన్పిస్తారని నిర్మాత వివరించారు.

ఇలాగే బాగుందని చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని, ఈ చిత్రంలో ముఖ్యమంత్రిగా విజయ్ చందర్, హోం మంత్రిగా కైకాల సత్యనారాయణ, ఇతని పి.ఎ.గా ఎల్.బి.శ్రీరామ్ నటించారని చెప్పారు.

ఇక జయప్రకాష్ రెడ్డి పాత్ర వ్యాపారవేత్తగా ఉంటూ ప్రభుత్వాలనే మార్చేయగల సత్తా ఉన్న పాత్ర అని, దర్శకుడిగా హనుమంత రెడ్డికి మంచి భవిష్యత్తు ఉందని నిర్మాత కుమార్ అన్నారు. ఇంకా చెప్పాలంటే... ఈ చిత్రానికి కథ, మాటలు ఆయనే సమకూర్చారని, సెన్సార్ బోర్డు పచ్చజెండా ఊపిందని నిర్మాత చెప్పారు.
About Writer
SELVI.M