గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » రాబోయే చిత్రాలు » సంక్రాంతి కానుకగా "సమర్థుడు"
రాబోయే చిత్రాలు
Feedback Print Bookmark and Share
 
FILE
కృష్ణంరాజు ప్రధాన పాత్రలో రాజా, సంజన హీరోహీరోయిన్లుగా అర్జున్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం "సమర్థుడు". ప్రస్తుతం ఈ చిత్రం క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించుకుంటుంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఆకుల నరేష్ మాట్లాడుతూ.. గత వారం రోజుల నుంచి కృష్ణంరాజు, రాజాలపై... ఫైట్ మాస్టర్ సతీష్ ఆధ్వర్యంలో పతాక సన్నివేశాలను చిత్రీకరించామన్నారు.

ఈ నెల ఆరో తేదీ నుంచి మలేషియా, బ్యాంకాక్‌లలో హీరోహీరోయిన్లపై నిక్సర్ నేతృత్వంలో పాటల చిత్రీకరణ జరుగుతుందని తెలిపారు.

మరో నిర్మాత వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ... సంగీత దర్శకులు పి. రాజశేఖర్ అందించిన ట్యూన్స్ మాస్‌ను తప్పకుండా ఆకట్టుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. డిసెంబర్‌లో ఆడియోను విడుదల చేసి సంక్రాంతికి సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత చెప్పారు.

ఇంకా ఈ చిత్రంలో వినోద్ కుమార్, వేణుమాధవ్, కృష్ణభగవాన్, జీవా, సురేఖా వాణి, హేమ, సన తదితరులు నటించారు. ఈ చిత్రానికి కెమెరా... దత్తు, ఎడిటింగ్... గౌతంరాజు, మాటలు... శ్రీనివాస్ మల్కారి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత... రవి పూదరి, సమర్పణ... వినయ్ రెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం... అర్జున్ రెడ్డి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర రాబోయే చిత్రాలు కృష్ణంరాజు రాజా సంజన అర్జున్ దర్శకత్వం