14న 550 ప్రింట్లతో వస్తున్న "సూర్య S/o కృష్ణన్"
"గజిని" సూర్య ద్విపాత్రాభినయంతో ఆస్కార్ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వి. రవిచంద్రన్ నిర్మాతగా గౌతమ్ వాసుదేవ మీనన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన భారీ చిత్రం "సూర్య S/o కృష్ణన్". హారిస్ జైరాజ్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఇటీవల సోని బిఎంజి ద్వారా విడుదలై ఘనవిజయం సాధించింది.
ఆస్కార్ బేనర్‌లో గతంలో వచ్చిన "అపరిచితుడు", "దశావతారం" వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలను తెలుగులో అందించిన ఎస్.వి.ఆర్. మీడియా అధినేతలు శోభారాణి, సి.జె.రమణ, పి.విజయ్ కుమార్ "సూర్య S/o కృష్ణన్ చిత్రాన్ని కూడా భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ నెల 14న 550 ప్రింట్లతో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదలవుతోంది.
ఈ సందర్భంగా హీరో సూర్య మాట్లాడుతూ... గౌతమ్ దర్శకత్వంలో "కాక కాక" తర్వాత చేసిన సినిమా ఇదన్నారు. తన కెరీర్‌లో ఇది నెంబర్ వన్ సినిమా అవుతుందని చెప్పారు. హారిస్ జైరాజ్ అందించిన మ్యూజిక్ ఇప్పటికే పెద్ద హిట్ అయిందని, ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని సూర్య ఆశాభావం వ్యక్తం చేశారు.
దర్శకుడు గౌతమ్ మీనన్ మాట్లాడుతూ... యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ నచ్చే విధంగా ఈ చిత్రం తెరకెక్కనుందన్నారు. సూర్య అద్భుతమైన ఫెర్‌ఫార్మెన్స్ ఈ చిత్రానికి హైలైట్‍గా ఉంటుందని చెప్పారు.
హారిస్ జైరాజ్ కాంబినేషన్‌లో ఇది తనకు మరో మ్యూజికల్ హిట్ అని గౌతమ్ అన్నారు. ఆస్కార్ రవిచంద్రన్ పతాకంపై చాలా లావిష్‌గా తీసిన ఈ చిత్రంలో లవ్, యాక్షన్, ఎమోషన్ అన్నీ అంశాలు మిళితమై ఉంటాయని ఆయన వెల్లడించారు.
దర్శకుడిగా తనకు అన్ని విధాలా ఈ చిత్రం సంతృప్తినిచ్చిందని, కమర్షియల్‌గా చాలా పెద్ద రేంజ్ సక్సెస్ అవుతుందని గౌతమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. సూర్య కెరీర్‌లో ఓ సెన్సేషనల్ ఫిలిం అవుతుందని ఆయన తెలిపారు.
ఎస్.వి.ఆర్ మీడియా అధినేత శోభారాణి మాట్లాడుతూ... గతంలో తమ మీడియాపై ఆస్కార్ ఫిలింస్ సినిమాలు తెలుగులో చాలా చేశామన్నారు. తాజాగా తెలుగులో విడుదల చేసిన "దశావతారం" ఎంత హిట్ అయ్యిందో అందరికీ తెలుసునని, ప్రస్తుతం సూర్య సన్నాఫ్ కృష్ణన్ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నామని చెప్పారు.
550 ప్రింట్లతో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 14న ఈ చిత్రం విడుదలవుతుందని శోభారాణి అన్నారు. తప్పకుండా 2008 బిగ్గెస్ట్ హిట్స్ లిస్ట్‌లో ఈ చిత్రం కూడా స్థానం సంపాదిస్తుందని ఆమె ఆకాంక్షించారు.
సూర్య, సమీరారెడ్డి, దివ్యస్పందన, సిమ్రాన్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి పాటలు... వేటూరి, సంగీతం... హారిస్ జైరాజ్, సినిమాటోగ్రఫీ... రత్నవేలు, దర్శకత్వం... గౌతమ్ వాసుదేవ మీనన్.