డిసెంబరులో వస్తున్న"పండుగాడు"
కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్, హన్సిక కాంబినేషన్‌లో రూపొందిన "బిందాస్" చిత్రాన్ని తెలుగులో "పండుగాడు"గా జె. బాలరాజు అనువదిస్తున్నారు. డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన డీటీఎస్ కార్యక్రమాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయని నిర్మాత తెలిపారు.
సీనియర్ దర్శకుడు డి. రాజేంద్రబాబు నేతృత్వంలో రూపొందిన ఈ చిత్రం కన్నడలో ఘనవిజయం సాధించిందని, తెలుగులోనూ అంతటి ఆదరణ చూరగొంటుందని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు. కథ, కథనంతో ప్రేక్షకులకు మంచి చిత్రాన్ని చూశామనే అనుభూతిని కలిగిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.
రొమాన్స్ సీన్స్, సెంటిమెంట్ అంశాలతో రూపొందించిన ఈ చిత్రంలో క్లైమాక్స్ పార్ట్‌ను గోల్కొండలో 20 రోజుల పాటు చిత్రించినట్లు నిర్మాత వెల్లడించారు. ఈ నెలాఖరులో ఆడియోను, డిసెంబరులో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు.
ఇంకా ఈ చిత్రంలో సుమారంగనాథ్, నాజర్, సుమన్, రాహుల్ దేవ్, వనిత కోమల్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి మాటలు.. ప్రభాకర్, పాటలు.. అనంత శ్రీరామ్, రాజేంద్ర, రామ్మూర్తి, కెమెరా.. వేణు, ఎడిటర్... మేనక శ్రీను, నిర్మాత... జె. బాలరాజు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. డి. రాజేంద్రబాబు.