డిసెంబరులో వస్తున్న "దౌర్జన్యం"
సుదీప్ కథానాయకుడిగా, అంజలాజవేరి, ఆశాషైనీ, తనూరాయ్ కథానాయికలుగా కన్నడంలో రూపొందిన ఓ చిత్రాన్ని శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ సంస్థ తెలుగులో అనువదిస్తోంది. ఎన్. శంకర్ దర్శకత్వంలో ఎస్.వి.ఎన్. సమర్పణలో ఆర్. సుదర్శన్ రెడ్డి, కె.వి. శ్రీధర్ రెడ్డి, ఎం.సి. శేఖర్ తీస్తున్న ఈ చిత్రానికి "దౌర్జన్యం" అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
ప్రస్తుతం అనువాద కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబరులో విడుదల చేస్తామని నిర్మాతలు వెల్లడించారు. ఇంకా వారు మాట్లాడుతూ... ఇందులో సుదీప్ ఓ పవర్ ఫుల్ పాత్ర పోషించారని, అంజలాజవేరి గ్లామర్ ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు. ప్రతి ఫ్రేమును దర్శకుడు చాలా చక్కగా మలిచారని నిర్మాతలు వెల్లడించారు.
దర్శకుడు మాట్లాడుతూ... యాక్షన్, సెంటిమెంట్ సమ్మేళనంతో... పల్లెటూరి నుంచి పట్నానికి వచ్చిన ఓ యువకుడి కథగా రూపొందుతోందని చెప్పారు. పట్నంలో దుష్ట రాజకీయాలు, గూండా గిరివల్ల ఇబ్బందుల పాలై చివరికి ఆ యువకుడు ఎలా ఎదురుతిరిగాడన్న కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటుందని దర్శకుడు అన్నారు.
కోట శ్రీనివాసరావు, సుబ్బరాజు, ఏవీఎస్, ఆశిష్ విద్యార్థి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం... గురుకిరణ్, ఫోటోగ్రఫీ.. సుధాకర్, ఎడిటింగ్.. గౌతం రాజు, సమర్పణ...ఎస్.వి.ఎస్.