జనవరిలో "ఇందుమతి" వస్తోంది
రాజేంద్రప్రసాద్ హీరోగా "అందరూ దొంగలే" వంటి ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాన్ని అందించిన జియో మీడియా ఆర్ట్స్ అధినేత హర్షారెడ్డి స్వీయ దర్శకత్వంలో "ఇందుమతి" చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో శివాజీ, శ్వేతా భరద్వాజ్, విజయ్, రఘుబాబు, హర్షవర్ధన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఇటీవలే ఈ సినిమా ఆడియో మార్కెట్లోకి విడుదలైంది. "ఇందుమతి" కూడా జనవరి మొదటి వారంలో విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి దర్శక నిర్మాత హర్షారెడ్డి మాట్లాడుతూ... ప్రస్తుత చిత్రాలకు భిన్నంగా ఉండే సినిమాలను నిర్మించాలనే తలంపుతో "ఇందుమతి"ని రూపొందించామన్నారు.
ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కల్గించే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇదని, సస్పెన్స్‌గా సాగే ఈ చిత్రంలో హాస్యాన్ని కూడా పండించామని హర్షారెడ్డి వెల్లడించారు. ఈ చిత్రంలో చాలా పాత్రలు చనిపోతూ ఉంటాయని, అయితే చనిపోయే ముందు వారికి "ఇందుమతి" కన్పిస్తుందని, అసలు ఈ "ఇందుమతి" ఎవరు? చనిపోయేవారికి "ఇందుమతి"కి ఉన్న సంబంధం ఏమిటి? అనే వైవిధ్యమైన అంశాలతో ఈ చిత్రం తెరకెక్కనుందని చెప్పారు.
విభిన్న కథ, కథనాలతో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని దర్శక నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు. డబ్బింగ్, రీరికార్డింగ్, మిక్సింగ్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి వాణిజ్య పరంగా మంచి క్రేజ్ లభించిందన్నారు.
ఇంకా ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.. రఘునాధరెడ్డి వారనాసి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. హర్షా. పి. రెడ్డి. ఫోటోగ్రఫీ... వాసు, సంగీతం... ఆనంద్.