1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

ఫిబ్రవరి 14న వస్తున్న ఆకాష్ "స్వీట్ హార్ట్"

వినోదం వెండితెర రాబోయే చిత్రాలు ఆకాష్ హీరో దర్శకుడు స్వీట్ హార్ట్ దేవీ మూవీస్ పతాకం తమన్నా ఫెయిర్ అండ్ లవ్లీ మోడల్ నిధి
WD

ఆకాష్ హీరోగా నటిస్తూ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం "స్వీట్ హార్ట్". దేవీ మూవీస్ పతాకంపై ఎన్. జె. రత్నావత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ "స్వీట్ హార్ట్" చిత్ర వివరాలను నిర్మాత తెలియజేస్తూ... డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర ఆడియోను జనవరి 18న మార్కెట్లోకి విడుదల చేయనున్నామన్నారు.

ఆకాష్ మాట్లాడుతూ... ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారని, మొదట తమన్నాను ఒక హీరోయిన్‌గా తీసుకున్నామని, అయితే ఆమె చాలా బిజీగా ఉండడంతో ఫెయిర్ అండ్ లవ్లీ మోడల్ నిధిని కథానాయికగా ఎంపిక చేశామని వెల్లడించారు.

నిధి పాత్ర ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని, మిగతా హీరోయిన్లుగా డైసీ బోపన్న, సుహాసిని నటించారని ఆకాష్ తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 14వ తేదీన చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు.

రాహుల్ దేవ్, బ్రహ్మానందం, చలపతిరావు, సత్యం రాజేష్, బ్రహ్మాజీ, శివారెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా.. జాక్, ఎడిటింగ్.. ఎం.ఆర్. వర్మ, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు... మోహన్, డి. శ్రీదేవి పవార్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. ఆకాష్.
About Writer
SELVI.M