1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న "16 డేస్"

వినోదం వెండితెర రాబోయే చిత్రాలు సంక్రాంతి 16 డేస్ అరవింద్ ఛార్మి కాస్మోస్ ఎంటర్టైన్మెంట్ ప్రభుసాల్మన్
WD

అరవింద్, ఛార్మి జంటగా కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న చిత్రం "16డేస్". ప్రభుసాల్మన్ దర్శకత్వంలో డి.వై.చౌదరి నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రం లవ్, యాక్షన్, సెంటిమెంట్, సస్పెన్స్ అంశాలతో రూపొందిందని దర్శకుడు చెప్పారు.

కాలేజీ చదువు పూర్తిచేసుకుని ఉద్యోగం వేటలో చెన్నై చేరిన ఓ యువకుడు అనుకోకుండా బద్ధశత్రువులైన ఇద్దరు డాన్‌ల మధ్య ఎలా చిక్కుకున్నాడన్నదే ఈ చిత్ర కథాంశమని దర్శకుడు వివరించారు. తనను తాను కాపాడుకోవడం కోసం 16 రోజుల పాటు ఆ యువకుడు ఎలాంటి ప్రయత్నాలు చేశాడన్నది చాలా ఆసక్తికరంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఛార్మి పాత్ర వైవిధ్యంగా ప్రేక్షకుల్ని అలరిస్తుందని, సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలు గల చిత్రమిదని ప్రభుసాల్మన్ వెల్లడించారు.
About Writer
SELVI.M