1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

జనవరి ఒకటిన "మెంటల్‌కృష్ణ" వస్తున్నాడు

వినోదం వెండితెర రాబోయే చిత్రాలు పోసాని కృష్ణమురళి సత్యకృష్ణన్ పోస్ట్ప్రొడక్షన్స్ మెంటల్ కృష్ణ మూడు షేడ్స్ నాగబాబు బ్రహ్మానందం ధర్మవరపు ఎంఎస్ నారాయణ
పోసాని కృష్ణమురళి, సత్యకృష్ణన్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న "మెంటల్ కృష్ణ" చిత్రం పోస్ట్‌ప్రొడక్షన్స్ తుదిదశలో ఉంది. ఈ చిత్రంలో పోసాని మూడు షేడ్స్‌లో కన్పిస్తారు.

ఈ సినిమా విశేషాలను నిర్మాత వడ్లపట్ల తెలియజేస్తూ... ఒక సామాజిక సమస్యను ఎలివేట్ చేస్తూ దర్శకుడు పోసాని ఆద్యంతం ఆసక్తికరంగా తీర్చిదిద్దారని చెప్పారు. టైటిల్ రోల్‌ను పోసాని అద్భుతంగా మలిచారని నిర్మాత వెల్లడించారు. స్త్రీని పురుషుడి ఆస్తిగా భావించే మన సమాజంలో ఆడది ఇంటి గడప దాటడం తప్పనే భావన నెలకొందని, దీన్ని ఈ చిత్రం ప్రశ్నిస్తుందని వడ్లపట్ల అన్నారు.

సెన్సార్ పూర్తి చేసుకుని జనవరి ఒకటో తేదీన చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత చెప్పారు. ఇంకా ఈ చిత్రంలో నాగబాబు, బ్రహ్మానందం, ధర్మవరపు, ఎం.ఎస్. నారాయణ తదితరులు నటించారు. కెమేరా.. గాదిరాజు శ్రీనివాస్, సంగీతం.. వందేమాతరం శ్రీనివాస్.
About Writer
SELVI.M