1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

"భూమా"గా రానున్న గీతాంజలి కుమారుడు

గీతాంజలి అధిత్ శ్రీనివాస్ భూమా దర్శకత్వం
WD
కొడుకు పుట్టగానే కాదు... అతడు ప్రయోజకుడయ్యాకే తల్లిదండ్రులు ఆనందించేది. ప్రస్తుతం నటి గీతాంజలి ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడు అధిత్ శ్రీనివాస్ హీరోగా భూమా అనే చిత్రం ద్వారా పరిచయం అవుతున్నారు.

బి. గోపాల్ దగ్గర పనిచేసిన కె.ఆర్. రత్నం దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కట్టా శకుంతల నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తొలికాపీ సిద్ధమైంది. నిన్ననే ఇండస్ట్రీలో కొంతమందికి చిత్రం ప్రివ్యూ చూపించారు. అనంతరం ఆమె తన కుమారుడు చేసిన నటనకు ప్రశంసలు వస్తుంటే ఉబ్బితబ్బిబ్బయ్యారు. మంచి కథతో చిత్రం రూపొందింది.

ఎక్కడా బోర్ అనిపించకుండా చిత్రాన్ని రూపొందించారు. రామకృష్ణగారు బతికి ఉంటే చాలా ఆనందించేవారని గీతాంజలి అన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ.. తన జీవితంలో తన తల్లిదండ్రులు చెప్పినట్లే నడుచుకునేదాన్ననీ, సీతారామకల్యాణంలో సీత పాత్ర ద్వారా పరిచయమయ్యాననీ చెప్పారు. కాగా భూమా చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుద చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రేలంగి నరసింహరావు, కె. రంగారావు, చిత్ర నిర్మాత, దర్శకులు మాట్లాడారు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT