ఫిబ్రవరి 6న వస్తున్న "బంగారుబాబు"
జగపతిబాబు, మీరాజాస్మిన్ హీరోహీరోయిన్లుగా, డా. దాసరి నారాయణరావు కథ, స్క్రీన్‌ప్లేలో రూపుదిద్దుకుంటున్న చిత్రం "బంగారుబాబు". సౌభాగ్య మీడియా లిమిటెడ్ పతాకంపై జొన్నలగడ్డ శ్రీనివాసరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
కె. రామకృష్ణ ప్రసాద్ నిర్మాణ సారథ్యం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం రీరికార్డింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. తుదిమెరుగులు దిద్దుకుంటున్న ఈ చిత్రం ఆడియోను మయూరి ద్వారా ఈ నెల 20వ తేదీన విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ... చిత్రం బాగా వచ్చిందని, ఆనాటి "బంగారుబాబు" చిత్రాన్ని మరిపిస్తుందని వెల్లడించారు. కుటుంబసమేతంగా చూడతగ్గ సినిమాగా అందరి ప్రశంసలు పొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి ఆరోతేదీన సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు.
మీరాజాస్మిన్, సోనూసూద్, షిండే తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు.. మరుధూరి రాజా, సంగీతం... శ్రీలేఖ, పాటలు చంద్రబోస్, చిన్ని చరణ్.