1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

త్వరలో తెరపైకి "నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్"

వినోదం వెండితెర రాబోయే చిత్రాలు నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్ శివాజీ కావేరీఝా బ్రహ్మానందం నాగేంద్రకుమార్
WD
శివాజీ, కావేరీఝా జంటగా బ్రహ్మానందం ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం "నా గర్ల్ ఫ్రెండ్ బాగా రిచ్". ఎం. నాగేంద్రకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని కుమార్ బ్రదర్స్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ... "మంత్ర" ఆనంద్ స్వరపర్చిన ఈ చిత్ర పాటలను ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేశామని వెల్లడించారు.

ఈ సినిమా పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించిందని నిర్మాతలు అన్నారు. అన్ని రకాల అంశాలను జోడించి పూర్తి వినోద భరితంగా తీర్చిదిద్దిన చిత్రమిదని, ప్రస్తుతం రీ-రికార్డింగ్ పనులు జరుగుతున్నాయని వారు వెల్లడించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈ నెల మాసాంతంలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

దర్శకుడు మాట్లాడుతూ... సంజయ్ శాస్త్రిగా శివాజీ, మైక్‌టైసన్‌గా బ్రహ్మానందం ఈ చిత్రంలో కన్పిస్తారని పేర్కొన్నారు. పై రెండు పాత్రలు చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయని, సినిమా ఆద్యంతం హాస్యభరితంగా ఉంటుందని దర్శకుడు వెల్లడించారు. తప్పకుండా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆహుతిప్రసాద్, తులసి, విజయసాయి, రమాప్రభ, బబ్లూ, గుండు హనుమంతరావు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా.. మారో, మాటలు... వేమగిరి, ఆర్ట్... నాగు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత... ఎ. పాండు.
About Writer
SELVI.M