1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

30న వస్తున్న "బ్యాంక్"

వినోదం వెండితెర రాబోయే చిత్రాలు జనవరి విడుదల అబ్బాస్ రాహుల్దేవ్ జాకీష్రాఫ్ అర్చన బ్యాంక్ మస్త్ శివాజీ ఆంచల్
WD

అబ్బాస్, రాహుల్‌దేవ్, జాకీష్రాఫ్, అర్చన ప్రధాన పాత్రధారులుగా బి. అరుణ్ కుమార్ దర్శక నిర్మాతగా రూపొందించిన చిత్రం "బ్యాంక్". ఈ సినిమా ఈ నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్వాహకుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ శనివారం వెల్లడించారు.

బ్యాంక్ దోపిడీ నేపథ్యంలో రూపొందిన చిత్రమిదని, హాలీవుడ్ తరహాలో ఈ సినిమా ఉంటుందని గౌడ్ తెలిపారు. ముంబై, చెన్నైలలో షూటింగ్ జరిపామని, దొంగతనంగా సంపాదించిన డబ్బు దక్కదనే సందేశాన్ని ఈ చిత్రం ద్వారా చెబుతున్నామని రామకృష్ణ గౌడ్ అన్నారు. ఇందులో ఐదు పాటలున్నాయని, "బొబ్బిలిపులి"లోని "ఓ సుబ్బారావు..." అనే పాటను రీమిక్స్ చేశామని వివరించారు. ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకముందని చెప్పారు.

పూజా భారతి, రఘువరన్, జీవా, నర్సింగ్ యాదవ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమేరా.. కె. జగదీష్, ఎడిటింగ్... రామ్‌గోపాల్ రెడ్డి, సంగీతం.. చిన్ని చరణ్, కథ, మాటలు, నిర్మాత, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం... బి. అరుణ్ కుమార్.