23న వస్తున్న శివాజీ "మస్త్"
|
ఈ సందర్భంగా ఎస్.వి. కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. కుటుంబకథా చిత్రాలు తీస్తున్న తాను తొలిసారిగా చక్కని యూత్‌ఫుల్ చిత్రాన్ని రూపొందించానన్నారు. అయినా ఈ సినిమా చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుందని చెప్పారు.
యువత భావాలు, పెద్దల ఆలోచనలు ఎలా ఉంటాయనేవి ఈ చిత్రంలో చక్కగా పొందుపరిచామని కృష్ణారెడ్డి తెలిపారు. చంద్రబోస్ సాహిత్యం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆద్యంతం వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగిందని హీరో శివాజీ తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాణ నిర్వహణ... సురేష్, వి.ఆర్.కె.రావు.
