1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

23న విడుదల కానున్న మహేష్ భట్ "రాజ్"

వినోదం వెండితెర రాబోయే చిత్రాలు 23న విడుదల మహేష్ భట్ రాజ్ క్రిమినల్ మోహిత్ సూరి ఇమ్రాన్ హష్మి
"రాజ్" సినిమా పేరు వినగానే మహేష్ భట్ స్ఫురిస్తారు. ఆ చిత్రమే తనకు ఎంతో పేరు తెచ్చిందని ఆయన అంటున్నారు. సీక్వెల్‌గా అదే పేరుతో (రాజ్) మరో చిత్రాన్ని నిర్మించారు. ఇందులోనూ కొత్తవారిని పరిచయం చేస్తున్నారు. హార్రర్ మూవీగా ఈ చిత్రం రూపొందింది. ఈ నెల 23న ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో.. చిత్ర యూనిట్ హైదరాబాద్ వచ్చింది.

ఈ సందరర్భంగా బంజారాహిల్స్‌లోని సినిమాక్స్‌లో ఏర్పాటు చేసిన విలేకురుల సమావేశంలో మహేష్ భట్ పలు విషయాలను వెల్లడించారు. అందరూ అనుకున్నట్లు తన కొత్త చిత్రం రాజా-2 కాదని, "రాజ్" అనే పేరు పెట్టానని చెప్పారు. ఆ పేరంటే తనకెంతో ఇష్టమని, హార్రర్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందించామన్నారు.

కథ గురించి చెప్పాలంటే.. ఆద్యంతం సుమన్ డాక్యుమెంటరీ ఫిలిం మేకర్.. ఆమె భార్య పెయింటర్ అయిన ఇమ్రాన్ హష్మి వద్దకు వస్తుంది. పెయింటింగ్ గీశాక దాన్ని చూస్తుంటే... నీ ప్రాణానికి అపాయముందని ఆమెతో హష్మి చెబుతాడు. కానీ ఆమె నమ్మదు. తర్వాత జరిగే సంఘటనలతో ఆమె భయకంపితురాలవుతుందని, అనంతరం జరిగే గమనమే ఈ చిత్రమని మహేష్ భట్ వివరించారు.

తెలుగులో సినిమా తీసే ఆలోచనే లేదని, గతంలో "క్రిమినల్" తీశానని, అప్పటి పరిస్థితులు వేరని భట్ పేర్కొన్నారు. ఈ సినిమా ఆద్యంతం సుమన్ అద్భుతంగా నటించాడని కొనియాడారు. అంతకుముందు "హా ఈ దిల్" అనే సినిమా చేసినా.. ఇదే తొలిసినిమాగా నటించాడని, మోహిత్ సూరి అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని చెప్పారు.

ఇమ్రాన్ హష్మి మాట్లాడుతూ.. తాను పెయింటర్‌గా నటించానని తెలిపారు. మామూలుగా తనకు హార్రర్ సినిమాలంటే ఇష్టమని, అందుకే మోహిత్ అడిగిన వెంటనే కథ వినకుండానే ఓకే చెప్పానని అన్నారు. తాను క్లాసికల్ సింగర్ ట్రైనింగ్ కూడా తీసుకున్నానని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

ఇంకా... సోనీ, బిఎం.జి సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం విశేష్ ఫిలింస్ బేనర్‌పై రూపొందింది.
About Writer
SELVI.M