1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

త్వరలో తెరపైకి "అనగనగా ఒక అరణ్యం"

వినోదం వెండితెర రాబోయే చిత్రాలు అనగనగా ఒక అరణ్యం హమ్ ఆప్కే సాథ్హై తెలుగు హిందీ టి సుల్తాన్ జంగిల్ హాలీవుడ్ ఫారెస్ట్ గంప్
WD
తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో "అనగనగా ఒక అరణ్యం" చిత్రాన్ని నిర్మిస్తున్నామని నిర్మాత టి. సుల్తాన్ చెప్పారు. హిందీలో "హమ్ ఆప్‌కే సాథ్‌హై" అనే పేరును ఖరారు చేశామన్నారు. బెనజీర్ సమర్పణలో శేఖర్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. రామోజీ ఫిలింసిటీ, కడప లంకమల్ల అడవులతో పాటు ముంబైలోనూ షూటింగ్ చేసినట్లు నిర్మాత తెలిపారు.

బాలీవుడ్‌లో రూపొందిన "జంగిల్", హాలీవుడ్‌లో రూపొందిన "ఫారెస్ట్ గంప్" వంటి చిత్రాల స్థాయిలో ఈ సినిమాను రూపొందించామన్నారు. ఇటువంటి చిత్రాలు తెలుగులో మరిన్ని వస్తాయనే అభిప్రాయాన్ని సుల్తాన్ అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ.. అది అరణ్యంలో జరిగిన చిత్రమైనప్పటికీ లవ్, కామెడీ, హార్రర్ సమపాళ్ళలో ఉంటాయన్నారు. ఈ చిత్రంలో ఐదుపాటలు, నాలుగు ఫైట్స్ ఉన్నాయని తెలిపారు.

ఇంకా ఈ చిత్రంలో కౌశల్, సైరాభాను, అనువైష్ణవి, దువ్వాసి మోహన్, రాంబాబు, మేల్కొటె, జాకీర్ తదితరులు నటించారు. కెమేరా.. పి. సుధాకర్ రెడ్డి, సంగీతం.. టి.ఎస్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. శేఖర్ చంద్ర.
About Writer
SELVI.M