ఉగాది కానుకగా "ఆకాశమంత"
|
తమిళంలో "అభియుమ్ నానుమ్"గా డిసెంబరులో ఈ సినిమా రిలీజ్ అయింది. దీన్ని ప్రకాష్ రాజ్ నిర్మించారు. ఇదే చిత్రం తెలుగు వర్షన్‌ను దిల్‌రాజు తీసుకుని తెలుగు నేటివిటికి సరిపడా సెకండ్ ఆఫ్‌ను మార్చి చిత్రీకరిస్తున్నారు. ఇందులో జగపతిబాబు ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.
జగపతిబాబు నటించే పార్ట్‌ను ఫిబ్రవరిలో చిత్రిస్తామని దిల్‌రాజు చెప్పారు. తమ సంస్థలో నమ్మకంతో నటించేందుకు అంగీకరించిన జగపతిబాబుకు దిల్‌రాజు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు.
తమ సంస్థ రూపొందించే సినిమాలంటేనే ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయని, వాటికి అనుగుణంగా ఈ చిత్రముంటుందని దిల్ రాజు వెల్లడించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా మార్చి 27వ తేదీ విడుదల చేస్తామని చెప్పారు.
