1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

ఫిబ్రవరి 12న జగపతిబాబు "సిద్ధం"

వినోదం వెండితెర రాబోయే చిత్రాలు ఫిబ్రవరి 12 జగపతిబాబు సిద్ధం ఐపీఎస్ పి సీతారామాంజనేయులు దయానాయక్ కిరణ్కుమార్ జెడి చక్రవర్తి సింధుమీనన్
WD
ఐపీఎస్ అధికారులైన పి. సీతారామాంజనేయులు, ముంబై పోలీసు అధికారి దయానాయక్‌ల జీవితంలో జరిగిన కొన్ని సంఘటన ఆధారంగా "సిద్ధం" అనే చిత్రం రూపొందుతోంది. జగపతిబాబు, సింధుమీనన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి కిరణ్‌కుమార్ నిర్మిస్తున్నారు.

"హోమం" చిత్రం తర్వాత జె.డి, జగపతిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా... ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 12న "సిద్ధం"ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు.

చిత్రం గురించి చెబుతూ... టాస్క్‌ఫోర్స్ విభాగంలో పనిచేసే పోలీసు అధికారిగా జగపతిబాబు ఇందులో కన్పిస్తారన్నారు. సంఘ విద్రోహశక్తుల్ని తుదిముట్టించడంలో ముందుండే వ్యక్తిగా జగపతిబాబు అద్భుతంగా నటించారని కొనియాడారు.

ఇంజనీర్లు భవనాలు నిర్మిస్తారు.. డాక్టర్లు వైద్యం చేస్తారు.. నేను చంపుతాను -అనే పాత్ర జగపతిబాబుదని తెలిపారు. గతంలో తమ సంస్థ నుంచి వచ్చిన "హోమం" సినిమా అందరికీ నచ్చిందని, "సిద్ధం" కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాత ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇంకా ఈ చిత్రానికి కెమేరా.. భరణి కె. ధరణ్, కూర్పు.. భానోదయ, సంగీతం.. అమర్ మోహిలీ.
About Writer
SELVI.M