1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

ఏప్రిల్‌లో తెరపైకి వస్తోన్న "రాజు మహారాజు"

వినోదం వెండితెర రాబోయే చిత్రాలు ఏప్రిల్ రాజు మహారాజు శర్వానంద్ మోహన్బాబు రమ్యకృష్ణ భాను పసుపులేటి కుమారస్వామి
శర్వానంద్, మోహన్‌బాబు, రమ్యకృష్ణ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం "రాజు మహారాజు". కుమారస్వామి క్రియేషన్స్ పతాకంపై పసుపులేటి కుమారస్వామి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భాను దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను అన్నపూర్ణ స్టూడియోలో శర్వానంద్‌‌తో ఓ పాటను పలువురు డాన్సర్లపై కొరియోగ్రాఫర్ నోబుల్ నేతృత్వంలో చిత్రీకరిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ఫ్యామిలీ, యూత్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఆరు పాటలున్నాయన్నారు. ఆస్ట్రేలియాలో ఓ పాటను చిత్రించాల్సి ఉంటుందని, మార్చిలో ఆడియోను, ఏప్రిల్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.

హీరో శర్వానంద్ మాట్లాడుతూ.. "గమ్యం" తర్వాత ఏడాది గ్యాప్‌లో మంచి కథ విన్నానని, ఈ చిత్రం ద్వారా డాన్స్‌కూడా బాగా చేయగలనని నిరూపించుకుంటానని అన్నారు. మోహన్‌బాబుతో నటించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. రమ్యకృష్ణ తన డ్రీమ్‌గర్ల్. ఆమెతో కలిసి నటించడం థ్రిల్‌గా ఉందని శర్వానంద్ అన్నారు. ఇందులో.. రిచ్‌పర్సన్‌గా నటిస్తున్నానని, ఓ కుటుంబాన్ని కాపాడే చిత్ర కథాంశంతో ఈ సినిమా తెరకెక్కనుందని ఆయన తెలిపారు.
About Writer
SELVI.M