చక్కని ప్రేమకథతో వస్తోన్న "జల్లు"
|
ఇటీవలే విడుదలైన ఆడియాకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించిందని నిర్మాత పేర్కొన్నారు. ఆరు పాటలకు నిహాల్ చక్కని బాణీలు సమకూర్చారని ఆయన తెలిపారు. ఈ నెలాఖరులో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత వెల్లడించారు.
దర్శకుడు మాట్లాడుతూ.. తొలకరి జల్లు ఎంతటి హాయిగా ఉంటుందో చక్కని ప్రేమకథతో కూడిన ఈ జల్లు కూడా అంత మానసికానందాన్ని కల్గిస్తుందని చెప్పారు. ఫిబ్రవరి 22న విడుదలైన ఆడియో హిట్టయిందని, సినిమా కూడా అంతటి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకముందన్నారు.
సంగీత దర్శకుడు నిహాల్ మాట్లాడుతూ.. ఆంధ్రేతరులు కూడా ఈ పాటలు బాగున్నాయంటున్నారని, ఎస్.పి. పాడిన "ఓ మౌనమా.." తనకు బాగా నచ్చిన పాటని, ఇంకా ఐదు పాటలు వేటికవి వైవిధ్యంతో కూడినవని నిహాల్ అన్నారు.
