1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

త్వరలో తెరపైకి రానున్న "సమర్థుడు"

వినోదం వెండితెర రాబోయే చిత్రాలు తెర సమర్థుడు కృష్ణంరాజు రాజా సంజన ఆకుల సురేష్ రెడ్డి విజయ్ రెడ్డి
కృష్ణంరాజు ప్రధాన పాత్రలో రాజా, సంజన హీరోహీరోయిన్లుగా దేవికా ప్రొడక్షన్స్‌, ఆరెంజ్ ఫ్రేమ్స్ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న చిత్రం 'సమర్థుడు'. ఆకుల సురేష్ పటేల్, విజయ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అర్జున్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్ర ఆడియోను త్వరలో విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. కృష్ణంరాజు పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందన్నారు. కామెడీపరంగా సన్నివేశాలను సహజంగా చిత్రీకరించామని నిర్మాతలు వెల్లడించారు. సంగీత దర్శకుడు రాజశేఖర్ అద్భుత బాణీలు సమకూర్చారని, ఈ నెలాఖరులో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని వారు తెలియజేశారు.

ఇంకా ఈ చిత్రానికి కెమేరా.. దత్తు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. అర్జున్.