1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

21న వస్తోన్న "మళ్ళీ మళ్ళీ"

వినోదం వెండితెర రాబోయే చిత్రాలు మళ్ళీ మళ్ళీ స్కంద కళ్యాణి రాజ్ ఆదిత్య శ్రీ సహస్య ఎంటర్టైన్మెంట్
WD
స్కంద, కళ్యాణి హీరోహీరోయిన్లుగా రాజ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం "మళ్ళీ మళ్ళీ". శ్రీ సహస్య ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై దినేష్ కుమార్ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రాన్ని ఈ నెల 21న విడుదల చేస్తున్నట్లు నిర్మాత తెలిపారు. తమన్ సంగీతం, శివేంద్ర ఛాయాగ్రహణం ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ.. వాణిజ్యాంశాలతో కూడా మర్డర్ మిస్టరీతో, ఒక వ్యక్తి జీవితంలో ఒక రోజు జరిగిన కథ ఇదని చెప్పారు. కాలేజీలో చదువు పూర్తిచేసుకున్న ఓ కుర్రాడు ఉద్యోగాన్వేషణలో ఉండగా అతని జీవితంలో అనేక మలుపులు సంభవిస్తాయని ఆయన వివరించారు.

ఈ చిత్ర పాటలకు మంచి స్పందన లభిస్తోందని వెల్లడించారు. "మఖ్‌డీ", "స్వదేశీ" తదితర చిత్రాల్లో నటించిన మకరంద్ దేశ్‌పాండే ఓ పాటలో అతిథి పాత్రలో కన్పిస్తారని దర్శకుడు చెప్పారు.
About Writer
SELVI.M