1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

నెలాఖరుకు వస్తోన్న ప్రభాస్ "బిల్లా"

వినోదం వెండితెర రాబోయే చిత్రాలు నెలాఖరు ప్రభాస్ బిల్లా అనుష్క నమిత కృష్ణంరాజు జయసుధ మెహర్ రమేష్ కంత్రి
WD
భక్తకన్నప్ప, బొబ్బిలి బ్రహ్మన్న, తాండ్రపాపారాయుడు వంటి చిత్రాలను నిర్మించిన గోపీకృష్ణా మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ చాలా విరామం తర్వాత నిర్మిస్తున్న తాజా చిత్రం "బిల్లా". కృష్ణంరాజు, ప్రభాస్ తొలిసారి నటిస్తున్న ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.

రెండు పాటలు మినహా సినిమా మొత్తం పూర్తయిందని, వచ్చేవారం ఆడియోను విడుదల చేస్తామని, ఈ నెలాఖరులోనే సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు నరేంద్ర, ప్రజోద్ తెలిపారు.

దర్శకుడు మాట్లాడుతూ.. కన్నడంలో పునీత్‌రాజ్‌కుమార్‌తో రెండు చిత్రాలు చేశానని, ఆ తర్వాత తెలుగులో ఎన్టీఆర్‌తో కంత్రి సినిమా చేశానని చెప్పారు. ప్రస్తుతం కృష్ణంరాజు వారసుడు ప్రభాస్‌తో చేస్తున్నారని, పెద్ద సంస్థలో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని వెల్లడించారు. మాఫియా డాన్ సినిమా అయినా బాండ్ సినిమాలా ఉంటుందని, సూపర్ 35 ఎం.ఎం కెమెరాతో పాటు, ఇతర అత్యాధునికి ఎక్విప్‌మెంట్స్‌ను ఉపయోగించామని వివరించారు.

భారీ యాక్షన్ సీక్వెల్స్‌ను అద్భుతంగా చిత్రీకరించామని, ప్రభాస్ స్టయిల్, వస్త్రధారణ, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తాయని తెలిపారు. ఏడు నెలలు శ్రమించి ఈ చిత్రం కోసం ఎయిట్ ప్యాక్ చేశారని, అనుష్క ఈ చిత్రంలో చాలా అందంగా కన్పిస్తుందని దర్శకుడు అన్నారు.

అదేవిధంగా నమిత పాత్ర కూడా వైవిధ్యంగా ఉంటుందని, ఇందులో హన్సిక స్పెషల్ సాంగ్ చేసిందని మెహర్ రమేష్ చెప్పారు. మణిశర్మ సంగీతం, సౌందరరాజన్ ఛాయాగ్రహణం ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని ఇందులో మొత్తం ఆరు పాటలున్నాయని వెల్లడించారు.

కృష్ణంరాజు పాత్ర గురించి చెబుతూ.. పోలీస్ కమిషనర్‌గా చేస్తున్నారని, మేకింగ్ పరంగా ఆయన ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మరువనని దర్శకుడు అన్నారు. మలేషియాలో యాక్షన్ ఎపిసోడ్‌ను రెండు హెలికాప్టర్లకు బదులు నాలుగు పెట్టి మరీ లావిష్‌గా చేయించారని చెప్పారు.

ఇంకా ఈ చిత్రంలో జయసుధ, అలీ, రెహమాన్, కెల్లీడార్జ్, ఆదిత్య, సుబ్బరాజు తదితరులు నటించారు. ఎడిటింగ్ మార్తాండ్ కె. వెంకటేష్, సమర్పణ.. డా. కృష్ణంరాజు, స్కీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం మెహర్ రమేష్.
About Writer
SELVI.M