20న ప్రేక్షకుల ముందుకు "టార్గెట్"
|
వచ్చేవారంలో ఆడియోను, ఈ నెల 20వ తేదీన సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాను ఆర్.కె. ఫిలింస్‌పై అన్ని కేంద్రాల్లో విడుదల చేయనున్నట్లు సమర్పకుడు పతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. దర్శకుడు కథను మలచిన తీరు బాగుందని, సినిమాను చూశానని, అద్భుతంగా తెరకెక్కించారని , ముమైత్ ఫైట్స్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయన్నారు.
రమేష్ రాజా మాట్లాడుతూ.. శివబాలాజీ సి.బి.ఐ. ఆఫీసర్‌గా చేశాడని, కథలో సస్పెన్స్ ఆసక్తికరంగా ఉంటుందని తెలిపారు. శివబాలాజీ, ముమైత్‌లు ఎత్తులకు పై ఎత్తులు చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయన్నారు.
కథాపరంగా అంతర్లీనంగా చక్కని సందేశం ఇమిడి ఉంటుందని, సురేష్ కుమార్ కెమేరా ఈ చిత్రానికి ప్లస్ అవుతుందని రమేష్ రాజా నమ్మకం వ్యక్తం చేశారు. కృష్ణారెడ్డి నేతృత్వంలో శివబాలాజీ, ముమైత్, శ్రద్ధాదాస్‌పై చిత్రించిన సల్సా డాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అన్నారు.
శివబాలాజీ మాట్లాడుతూ.. తొలికాపీ చూశాక చాలా సంతృప్తి చెందానని, ఇటు మాస్ అటు క్లాస్ ప్రేక్షకుల్ని టార్గెట్ అలరిస్తుందని వెల్లడించారు. ఇంకా ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత... ఘంటా శ్రీనివాసరావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. రమేష్ రాజా.
