ఉగాది కానుకగా "ఆనందతాండవం"
"హ్యాపీడేస్" ఫేమ్ తమన్నా ప్రధాన పాత్రలో, ఆస్కార్ ఫిలింస్ పతాకంపై అగ్రనిర్మాత వి.రవిచంద్రన్ నిర్మిస్తున్న "ఆనందతాండవం" సినిమా ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సోని బిఎంజి ద్వారా ఈ సినిమా ఆడియోను, ఈ నెల 27న సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ చెప్పారు. ప్రస్తుతం షూటింగ్‌తో పాటు అన్ని కార్యక్రమాలను ఈ సినిమా పూర్తి చేసుకుందని ఆయన వివరించారు.
వరుసగా బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్స్ ఇస్తోన్న ఆస్కార్ ఫిలింస్ పతాకం నుంచి వస్తోన్న మరో భారీ చిత్రం "ఆనందతాండవం" కూడా సంగీతపరంగా విజయవంతమవుతుందని "ఆనందతాండవం" చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులను అందిస్తున్న ఎస్.వి.ఆర్. మీడియా సంస్థ అధినేత్రి శోభారాణి అన్నారు. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు విజేత ఎ.ఆర్. రెహ్మాన్ మేనల్లుడు జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారని శోభారాణి తెలిపారు.
తమన్నా, సిద్ధార్థ, రుక్మిణి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ.. జీవాశంకర్, ఆర్ట్.. పద్మశ్రీ తోట తరణి, సంగీతం.. జి.వి. ప్రకాశ్ కుమార్, కథ.. సుజాత, మాటలు.. శశాంక్ వెన్నెలకంటి, పాటలు... సుద్దాల అశోక్ తేజ, భువనచంద్ర, వనమాలి, ఎడిటింగ్.. వి.టి. విజయన్, డాన్స్.. రఘురామ్, నిర్మాత... ఆస్కార్ ఫిలింస్ రవిచంద్రన్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం.. ఎ.ఆర్. గాంధీ కృష్ణ.