సమ్మర్ స్పెషల్‌గా వస్తోన్న "కరెంట్"
|
అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో, శ్రీ నాగ్ కార్పొరేషన్ పతాకంపై చింతలపూడి శ్రీనివాసరావు, ఎ. నాగసుశీల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నవదర్శకుడు సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు.
ప్రస్తుతం "కరెంట్" చిత్రానికి సంబంధించిన ఓ పాటను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో, ప్రేమ్ రక్షిత్ నృత్య దర్శకత్వంలో చిత్రీకరిస్తున్నారు. సుశాంత్, స్నేహాఉల్లాల్‌లపై చిత్రీకరిస్తున్న ఈ పాట కోసం మూడు సెట్స్‌ను నిర్మించారు.
వరుసగా చిత్రంలోని పాటలన్నింటిని చిత్రీకరించి సమ్మర్ స్పెషల్‌గా "కరెంట్" చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు వెల్లడించారు. లవ్ సబ్జెక్ట్స్‌తో కూడిన ఈ సినిమా కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేస్తుందని, సుశాంత్ సినీ కెరీర్‌కు ఈ చిత్రం టర్నింగ్ పాయింట్ అవుతుందని వారు తెలిపారు.
"కరెంట్" సినిమాలో సుశాంత్ డ్యాన్స్ సూపర్‌గా ఉంటుందని, ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న పాట చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుందని డాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ అన్నారు. సుశాంత్‌లో హీరోగా మాస్‌ను ఆకట్టుకునే లక్షణాలు చాలా ఉన్నాయని ఆయన వెల్లడించారు.
చరణ్ రాజ్, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, సునీల్, షఫీ, రఘుబాబు, సుధ, ఝాన్సీ, రష్మీ, విజయ్, కిశోర్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం.. దేవిశ్రీప్రసాద్, ఫోటోగ్రఫీ.. విజయ్ సి. కుమార్, ఫైట్స్.. కనల్ కణ్ణన్, ఆర్ట్.. నారాయణరెడ్డి, ఎడిటింగ్.. మార్తాండ్ కె. వెంకటేష్.
