1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. రాబోయే చిత్రాలు

ఉగాది కానుకగా వస్తోన్న "బుద్ధిమంతుడు"

వినోదం వెండితెర రాబోయే కథనాలు ఉగాది బుద్ధిమంతుడు ఉపేంద్ర గాలి జనార్థన నాయుడు
WD
ఉపేంద్ర కన్నడంలో నటించిన చిత్రాన్ని తెలుగులో "బుద్ధిమంతుడు"గా అనువదించారు. గాలి జనార్థన నాయుడు సమర్పిస్తున్న ఈ చిత్రానికి సి.హెచ్. లక్ష్మీకాంతరెడ్డి, పి. హనుమంతరెడ్డి నిర్మాణ సారధ్యం వహించిన ఈ చిత్రం ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఫిలింఛాంబర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా "టాటా బిర్లా మధ్యలో లైలా" ఫేమ్ దర్శకుడు శ్రీనివాసరెడ్డి ఆడియో సీడీని ఆవిష్కరించి హీరో ఉపేంద్రకు అందజేశారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత హనుమంత రెడ్డి మాట్లాడుతూ.. బళ్ళారిలో తమకు నాలుగు థియేటర్లున్నాయని, అక్కడ ఈ చిత్రం 120 రోజులు దిగ్విజయంగా ప్రదర్శించబడిందని తెలిపారు. ఇదే తరహాలో తెలుగులో కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.

మరో నిర్మాత లక్ష్మీకాంత రెడ్డి మాట్లాడుతూ.. తెలుగులోనే కాకుండా.. తమిళం, హిందీల్లో కూడా విడుదలై మంచి విజయాన్నిసాధించారని వెల్లడించారు. ఉగాది కానుకగా ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నట్లు లక్ష్మీకాంత రెడ్డి వెల్లడించారు.

శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. "నేను వాణ్ణి కాదు" అనే ట్యాగ్ లైన్ కథకు సరిపోతుందన్నారు. తెలుగులో కూడా ఈ సినిమా విజయవంతం కావాలని శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు.